![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/simraj-415x250.jpg)
తెలుగు ఇండస్ట్రీలో తొంభైవ దశకంలో అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా వెలిగిపోయిన సిమ్రాన్ బాలీవుడ్ నుంచి వచ్చిన భామ. అయితే బాలీవుడ్ లో సరైన సక్సెస్ రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సిమ్రాన్ తెలుగు, తమిళం ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించింది. ఉత్తరాదికి చెందిన ఈమెను తెలుగులో మొదటగా దర్శకుడు శరత్ తన చిత్రం ‘అబ్బాయిగారి పెళ్లి’ ద్వారా పరిచయం చేసాడు. ఈమె పలు తమిళ, తెలుగు, హిందీ, మళయాళం సినిమాలలో నటించింది.
మృగరాజు చిత్రంలో చిరంజీవి, సిమ్రాన్
సిమ్రాన్ తండ్రి అశోక్ నవల్. తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. ఈమె ముంబై లో డిగ్రీ చదివింది. ముందుగా మోడలింగ్ రంగంలో పని చేసి, తరువాత సినిమాలలోకి వచ్చింది. మొదటి హిందీ చింత్రం ఈ "సనమ్ హార్‌జాయె" అది అనుకున్నంత విజయం సాధించ లేక పోయింది. అంతే కాదు సిమ్రాన్ దూరదర్శన్‌లో వచ్చే "సూపర్ హిట్ ముకాబలా" కార్యక్రమంలో ఈమె పాల్గొంది. ఈ అమ్మడు దక్షిణాదిలో ఈమె మొదటి సినిమా మళయాళంలో "ఇంద్రప్రస్థం" లో పరిచయం అయ్యింది.
నరసింహ నాయుడు చిత్రంలో బాలకృష్ణ,సిమ్రాన్
తమిళ చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్‌స్టార్" అని పేరు తెచ్చుకొంది. తెలుగులో మా నాన్నకు పెళ్ళి, సమర సింహా రెడ్డి , కలిసుందాం రా,డాడీ,మృగరాజు,రసింహ నాయుడు,సీతయ్య లాంటి చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించి తెలుగు లో టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయాంది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆహా కళ్యానం చిత్రంతో ప్రారంభించాలనుకున్నా ఆది పెద్ద సక్సెస్ కాలేదు. తెలుగులో 1999 నుంచి 2004 వరకు అగ్రకథానాయక గా కొనసాగింది.