Image result for anushka shetty baahubali 2



అనుకున్న ఎఫ్ఫెక్ట్ తీసుకు రావడానికి దేనికైనా వెనకాడడు మన దర్శక ధిగ్గజం రాజమౌళి. ఆయన నిర్మాతలూ ఎంతైనా ఖర్చుకు వెనకాడరు. బాహుబలి -2 ది కంక్లూజన్ విడుదలకు సిద్ధమౌతున్న వేళ ప్రజలంతా చర్చిచుకునేది అనుష్క సైజే.  


బాహుబలి సినిమా విడుదలకు ముందే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ప్రీ- రిలీజ్‌లోనే బ్రహ్మాండ మైన క్రేజును హైప్‌ను ప్రజల్లో పెంచేసింది. ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు నటించారు. ఈ సినిమా కోసం నటులందరూ తీవ్రంగా శ్రమించారు. 


Image result for anushka shetty baahubali 2



అయితే అనుష్క మాత్రం ఎంత కష్టపడినా రాజమౌళి ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోలేకపోయింది. విషయం ఏమిటంటే,"సైజ్-జీరో"  కోసం 'వళ్లు పెంచిన అనుష్కకు ఒళ్లు తగ్గించడం' కష్టంతో కూడుకున్న పనిగా మిగిలిపోయిందని అభిజ్ఞవర్గాల కథనం. బాహుబలి -1 చిత్ర నిర్మాణం సమయంలోనే బాహుబలి-2కు సంబంధించిన చాలా సన్నివేశాలను చిత్రీకరించారు. రెండేళ్ల క్రితం అనుష్క చాలా "స్మార్టుగా - స్లిమ్‌" గా ఉండేది. కానీ అనుష్క కాస్తా స్వీటీఐ బొద్దుగా తయారైంది. దీంతో, అప్పుడు చిత్రీక రించిన సన్నివేశాలకు, ఇప్పుడు తీసిన సన్నివేశాలకు చాలా తేడా వచ్చి సింక్ అవ్వలేదని తెలుస్తుంది.



రావలసిన ఎఫ్ఫెక్ట్ కోసం అనుష్క అనే శిల్పంపై "దేవసేన" గా మలచాలంటే జక్కన్న అనే శిల్పికి "ఉలి" చాలదు దానికి గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్,  వి ఎఫ్ ఎక్స్" లతో వెండితెరపై నాటి "అందాల దేవసేన" ని ప్రొడ్యూస్ చేసి ప్రెసెంట్ చెయ్యక పోతే ఇంత అద్భుతమైన సినిమాకి పెట్టిన సొమ్ములు తిరిగిరావు.  అనుష్క బాహుబలిలో కీలక రోల్ కావడంతో నిర్మాతలు ఆమె కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సైతం వెనుకాడలేదని తెలిసింది. జక్కన్న మాత్రం అనుష్కను  అందంగాను నాజూగ్గా కనిపించేలా చేసేందుకు మల్లగుల్లాలు పడ్డారని సమాచారం. 


అందుకే అనుష్క వల్ల బాహుబలి నిర్మాతలకు ఏకంగా రూ.20 కోట్ల వరకు ఎక్కువ ఖర్చైందని టాలీవుడ్ వర్గాల సమాచారం. 


Image result for anushka shetty baahubali 2

మరింత సమాచారం తెలుసుకోండి: