భారత్ దేశ కేటగిరి-1, బ్రిక్స్ దేశాల పరిదిలో 122వ, మొత్తం ఆసియా దేశాల్లో 223వ రాంక్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) వారిచే A+ కేటగిరి అవార్డు పొందిన   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మల్టీ డిసిప్లీనరీ యూనివర్సిటీ  - శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) తన పరిధిలోని యుజి/ పిజి/ డిప్లమా/ ప్రొఫెషనల్/ ఇంజనీరింగ్/ ఫార్మసి/ ఎమ్ టెక్/  తదితర విద్యా విభాగాలకు సంబంధించి విశ్వవిద్యాలయ ప్రాంగణంతో పాటు, 247 అనుబంధ కళాశాలలో మరియు దూర విద్య పద్దతిలో విద్యా సేవలు పొందుతున్న దాదాపు రెండు లక్షల మంది విద్యార్ధులకు... "డిజిటల్ ఏస్వియు’’ అనే ఉచిత మొబైల్ యాప్ ద్వారా విశ్వవిద్యాలయ సేవలను అందించటానికి  డిజిటల్ గా రూపాంతరం చెంది... దేశంలోనే తొలి డిజిటల్ విశ్వవిద్యాలయంగా అవతరించింది.


 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత సాంకేతిక విద్యాశాఖామాత్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి సమక్షంలో ప్రారంభించబడి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం చే  గత రెండేళ్లగా ఉపయోగించబడుతున్న "డిజిటల్ ఎడ్యుకేషన్ ఇకో సిస్టం - డిఈఈఎస్" – అనే పూర్తి మరియు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫామ్ - "ఇంటర్నేషనల్ ఎడ్యు-టెక్ ఇన్నోవేషన్"... ఎస్వీయూ అకాడమిక్స్, పరీక్షలు, ఫైనాన్స్ విభాగాలను ఇప్పటికే డిజిటలైజ్ చేసి సమీప భవిష్యత్ లో ఎస్టాబ్లిష్మెంట్స్, పరిపాలన మొత్తాన్ని డిజిటలైజ్ చేసి అంతర్జాతీయ స్థాయిలో తమ విద్యా సేవలను అతి తక్కువ ఖర్చుకే ప్రతి విద్యార్ధికి అందించటమే కాదు ఇంకా అనేక మందికి విస్త్రుత పరచడానికి సమాయత్తం అవడం అనేది ఒక అద్భుత పరిణామం. 


 "డిజిటల్ ఏస్వియు’’ అనే ఉచిత మొబైల్ యాప్ ద్వారా... శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తన   విద్యార్ధులు ప్రతి ఒక్కరికి విశ్వవిద్యాలయ సేవలు చిటికలో ఉచితంగా ఇవ్వనుంది. విద్యార్థినీ, విద్యార్థులు తన  వివరములు, పరీక్ష దరఖాస్తులు, ఫీజు జమలు చెల్లింపులు, హాల్ టిక్కెట్లు, పరీక్షా ఫలితాలు, మార్కుల మెమోలు, డిజిటల్ విద్యా ధృవపత్రాలు, ముఖ్యమైన నోటిఫికేషన్స్... ఒక్కటేమిటి విద్యార్ధులు కోరుకున్న ప్రతిసేవ 24x7 "డిజిటల్ ఏస్వియు’’ అనే ఉచిత మొబైల్ యాప్ ద్వారా  అందు బాటులో ఉంచింది. ఇతర వివరాలకు ఈ లింక్ ను సంప్రదించండి 


శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం "డిజిటల్ ఏస్వియు’’ ద్వారా, అందరు విద్యార్థినీ, విద్యార్థులకు  రియల్ టైమ్ లో...  పూర్తి పారదర్శకతతో,  సమర్ధత, విద్యవిషయాల్లో ఖచ్చితత్వం, ప్రజాస్వామిక పద్దతిలో, అత్యద్బుత వేగవంతమైన, సర్వత్రా-సర్వదా అత్యంత అభివృద్ది చెందిన " రేపటి విద్య నేడే" అన్న రీతిన పరిణామాత్మక, గుణాత్మక, సేవలు అందిస్తుంది. 


"డిజిటల్ ఏస్వియు’’  ఉచిత మొబైల్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్స్ ద్వారా యాండ్రాయిడ్ మొబైల్స్  లోనూ, యాపిల్ యాప్ స్టోర్స్ ద్వారా ఐఫోన్ లోనూ విద్యార్థినీ, విద్యార్థులు అందరూ ఇన్ స్టాల్ చేసుకోవొచ్చు.  ఒక ప్రభుత్వ విశ్వ విద్యాలయం...  24x7 నిరవధికంగా – నిరంతరంగా డిజిటల్ మీడియం ద్వారా ఈ విధంగా తన సేవలు  అందించడం భారత దేశంలోనే కాదు, బాహుశా  ఆసియా ఖండంలో నే  ప్రప్రథమం కావొచ్చు...  


 7 కోట్లు పై చిలుకు విలువ కలిగిన  ఇంటర్నేషనల్ ఏడు-టెక్ ఇన్నోవేషన్ అయిన "డిజిటల్ ఏడ్యుకేషన్ ఇకో సిస్టం – డిఈఈఎస్ ’’ ను కోటీ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీ వెంచర్స్ ప్రయివేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం  కు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎటువంటి ఖర్చు లేకుండా ఇవ్వడం జరిగింది.  


శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గురించి : 
1954 లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయ నగరం తిరుపతిలో 1000 ఏకరాల మనోహరమైన హిల్-వ్యూ వాతావరణంలో స్థాపించబడింది  శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. 


 కోటీ గ్రూప్ ఆఫ్ టెక్నాలజికల్ వెంచర్స్ R&D ప్రై.లిమిటెడ్  గురించి : 
ఈ సంస్థ ప్రస్తుతం చాలా ప్రఖ్యాతిగాంచిన 14 సాంకేతిక పరిశోధన మరియు అభివృద్ది కంపెనీల సమూహం.  ఏడ్యుటెక్, హెల్త్ టెక్, ఫిన్ టెక్, కన్స్ట్రక్షన్ టెక్, అగ్రి టెక్,   మీడియా టెక్ మొదలైన సృజనాత్మక సాంకేతికతను ప్రపంచంలోని 238 దేశాల్లోని 784 కోట్ల జనావళిని చేరువ చేసి సకల జనావళికి చక్కని మరో సాంకేతిక ప్రపంచాన్ని సృష్టి చేయాలన్న ఆకాంక్ష కోటీ గ్రూప్ ఆఫ్ టెక్నాలజికల్ వెంచర్స్ R&D  ఉంది.    


33% తమ సంపాదనను ఒక కార్పోరేట్ సామాజిక భాధ్యతతో బాల బాలికల విద్యకు, వృద్ధులకు ఔషధ అవసరాలకు, వితంతు మాతా శిశుసంక్షేమానికిs, అన్నార్తుల క్షుద్భాధ తీర్చటానికి వినియో గించే సేవా ఫౌండేషన్ మరియు  కోటీ ఫౌండేషన్ లకు ఈ కోటీ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీ వెంచర్స్ ప్రయివేట్ లిమిటెడ్ మాతృ సంస్థ.


ఈ సంస్థ నూరుశాతం తమ సృజనాత్మకత నైపుణ్యంగల స్వంత ఉద్యోగులు కలిగి సాంకేతికతలో పరిశోధన & అభివృద్ధి నిరంతరం నిర్వహించే వ్యవస్థ. దీనికి ప్రపంచ స్థాయి పేటెంట్స్ ఉన్నాయి... విభిన్న వైవిధ్య శీర్షాల్లో సాంకేతిక ఉత్పత్తులు సాధించి ప్రజలకు వ్యాపారాలకు చక్కని ప్రపంచాన్ని ఇవ్వగల సంస్థ.  ప్రపంచ వ్యాప్తంగా 160+ దేశాల్లో ఇప్పటికే 5+ కోట్ల మంది ప్రజలకు టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ద్వారా సేవలు అందించింది.


మరిన్ని వివరాల కోసం : kotii@kgvpl.com, 9618008811, https://www.kgvpl.com 


మరింత సమాచారం తెలుసుకోండి: