ప్రస్తుత సమాజంలో ఆధార్ కార్డు ఓ భాగంగా మారిపోయింది. ఏ ప్రభుత్వ పనికైనా ఆధార్ ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సేవలు పొందాలన్న కూడా ఆధార్ ఉండాలి. మరియు విద్యకు, ఉద్యోగాలకు, గ్యాస్ కనెక్షన్లకు ఇలా చెప్పుకుంటూ పోతో మన జీవీతంగా ఆధార్ అన్నిటికి ప్రధానంగా మారిపోయింది. ఆధార్ ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ. బయోమెట్రిక్ కార్డుల వల్ల ఎవరైనా, ఎక్కడైనా ఠక్కున గుర్తించవచ్చు.
ప్రతి పౌరుడికీ గుర్తింపు కార్డును జారీ చేయాలన్న ఉద్దేశంతో 'జాతీయ జనాభా రిజిస్టర్' తయారీ, 'జాతీయ పౌరగుర్తింపు కార్డు లివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మీ ఆధార్ కార్డు పోయినట్టు అయితే ఎంతో సులువుగా డూప్లికేట్ ఆధార్ సంపాధించవచ్చు. అది ఎలాగో ఓ లుక్కేయండి..
- ముందుగా పిసి బ్రౌజర్‌లో
www.uidai.gov.in సైట్ ను ఓపెన్ చేసి Aadhar service సెక్షన్ ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత 'Retrieve Lost or Forgotten EID/UID' లింక్ ను ఓపెన్ చేసుకోవాలి.
- ఆ తర్వాత పేజీలో అవసరమైన వివరాలను నమోదు చేయాలి. పేరు, మొబైల్ నంబర్,ఇ-మెయిల్ మరియు సిస్టమ్-జనరేటెడ్ సెక్యూరిటీ కోడ్ వంటి వవరాలను ఎంటర్ చేయాలి.
- దీని తర్వాత చేయాల్సింది ఏంటంటే మీరు EID (నమోదు సంఖ్య) లేదా UID (ఆధార్ నంబర్) ను తిరిగి పొందాలనుకుంటున్నారా అని నిర్దేశించండి.
- ఒకసారి మీ వివరాలన్నిటిని చెక్ చేసుకుని కింద ఉన్న Send OTPపై క్లిక్ చేయాలి. వెంటనే మీ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మొత్తం చెక్ చేసుకోవాలి.
- చివరిగా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీ ఇ-మెయిల్ మరియు మొబైల్ నెంబర్ కు ఆధార్ నెంబర్ వస్తుంది. చూశారుగా మీ ఆధార్ కార్డు పోయి ఉంటే ఎంతో సులువుగా డూప్లికేట్ ఆధార్ పొందవచ్చు.